TG | అంగరంగ వైభవంగా రథోత్సవ వేడుకలు.

TG | అంగరంగ వైభవంగా రథోత్సవ వేడుకలు.
TG | గట్టుప్పల, ప్రభన్యూస్ : మండల కేంద్రంలోని శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేశ్వర స్వామి 48 వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.వేకువ జామున శివపార్వతులకు భావనఋషి భద్రావతులకు వేద బ్రాహ్మణులు బ్రహ్మశ్రీ మాడ పాపయ్య శర్మ,బ్రహ్మశ్రీ మాడ సుధాకర్ శర్మ,బ్రహ్మశ్రీ వెంకటరమణ శర్మ, శివ శ్రీ పురాణ మఠం శివానందం అయ్యవారు, శివ శ్రీ పురాణ మఠం విద్యా సాగర్ అయ్య వారు, బ్రహ్మశ్రీ పాల పవన్ శర్మ, నిత్య అర్చకులు చెరుపెల్లి లక్ష్మయ్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
దేవాలయ అధ్యక్షులు అవ్వారు గీతా శ్రీనివాస్ రథోత్సవ వేడుకలను ప్రారంభించారు. డప్పు చప్పులతో కేరళ కళాకారుల నృత్యాలతో, భజనలతో, కోలాటాలతో, డీజే డాన్సులతో వీధులన్నీ మారుమ్రోగాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి రధోత్సవంలో పాల్గొన్నారు. రధాన్ని లాగడానికి భక్తులు తండోపతండాలుగా పోటీ పడ్డారు. రథోత్సవ యాత్ర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దేవాలయం ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నామని జగన్నాథం, మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, జెల్ల షణ్ముఖి, యిడం కైలాసం, దోర్నాల నరేందర్, చెరుపల్లి చంద్రమౌళి, నామని వెంకటేశం, గంజి కృష్ణయ్య, ప్రజా ప్రతినిధులు, దేవస్థానం కార్యవర్గం, నిర్మాణ కమిటీ కార్యవర్గం, ఉత్సవ కమిటీ, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
