Telangana | బెల్లంపల్లి నుండి 79 ప్రత్యేక బస్సులు!

Telangana | బెల్లంపల్లి నుండి 79 ప్రత్యేక బస్సులు!

  • జాతర బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
  • మహిళలకు ఉచిత ప్రయాణం.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

Telangana | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి మేడారానికి వెళ్లే 79 ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సబ్ కలెక్టర్ మనోజ్, ఆసీఫాబాద్ డీఎం . కె. వి రాజశేఖర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Telangana

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు. భక్తులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడకుండా, సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. జాతర ముగిసే వరకు బెల్లంపల్లి నుండి నిరంతరంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ వద్ద ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply