Nanded | గురుద్వారాను సందర్శించిన పవన్ కల్యాణ్..

Nanded | గురుద్వారాను సందర్శించిన పవన్ కల్యాణ్..
Nanded | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. నాందేడ్‌లోని సచ్ ఖండ్ గురుద్వారాను సందర్శించారు. నాందేడ్ చేరుకున్న పవన్ కల్యాణ్ ను ప్రభుత్వ అతిథి హోదాలో మహారాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది.
ప్రముఖ సిక్కు గురువు శ్రీగురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ ఇక్కడికి వచ్చారు. పర్యటనలో భాగంగా గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్, ఆయన కుమార్తె భోకార్ ఎమ్మెల్యే జయ చవాన్, శాసన మండలి సభ్యులు రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువులు డిప్యూటీ సీఎంను ఆశీర్వదించారు.
