AP | ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం

AP | ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం
AP | ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాసిల్దారు విజయప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు, రెవెన్యూ ఉద్యోగులు గ్రామంలో ర్యాలీ నిర్వహించగా, ఓటు యొక్క విలువను తాసిల్దార్ విజయప్రసాద్ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కనకదుర్గ, ఆర్ఐ శ్రీనివాస్ రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
