Minister | ఎమ్మెల్యే గండ్రకు మంత్రి తుమ్మల అభినందనలు..

Minister | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : జయశంకర్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం పాత ఇస్సీపేట గ్రామంలో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ… ఎమ్మెల్యే గండ్ర సత్తన్న నన్ను ఒక్క గోడౌన్ శంకుస్థాపనకు పిలిచి, నియోజకవర్గానికి మరిన్ని గోడౌన్ లు, మోడల్ మార్కెట్ లు, సొసైటీలు, మరిన్ని అభివృద్ధి పనులు కావాలని అడిగారనీ చమత్కరించారు.

ఇంకా అభివృద్ధిపై ఆకాంక్ష కలిగిన నాయకులు, భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్నీ, ప్రతీ గడపను టచ్ చేసిన రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ అని కొనియాడారు. నాకు పరిచయం అయినప్పటి నుండి చూస్తున్నాను. ఎన్నికలు ఉన్నా, లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రతీ గడప తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ‌కు ప్రజల కొరకు కష్టపడి పనిచేయాలనే తపన ఉన్న నిక్కచ్చైన వ్యక్తిత్వం ఉన్న సత్యనారాయణ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల అదృష్టం అని కొనియాడారు.

Leave a Reply