Vijayawada | టిడిపి విజయాలలో బొప్పన ది కీలక పాత్ర..

Vijayawada | టిడిపి విజయాలలో బొప్పన ది కీలక పాత్ర..

  • భవ కుమార్ కు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు
  • విజయవాడలో ఘనంగా టిడిపి నేత బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలు

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలు శనివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై భవకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో భవకుమార్ కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, పార్టీ కోసం భవకుమార్ అంకితభావంతో చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.

తెలుగుదేశం పార్టీ విజయాల్లో భవకుమార్ కృషి కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి, మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీకి నిరంతరం అంకితభావంతో సేవలందిస్తున్న భవకుమార్‌కు భవిష్యత్తులో మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా పలువురు నేతలు ఆకాంక్షించారు.

Leave a Reply