Balayya | మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..?

Balayya | మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కడం లేదు. ఈ సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్టే అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అసలు తెర వెనుక జరుగుతోంది..?

Balayya

బాలయ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా అని గతంలో ప్రకటించడం.. ఆతర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం తెలిసిందే. ఆతర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999తో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనికి క్రిష్ డైరెక్టర్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కలిసి నటిస్తాడని టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అట‌కెక్కిన‌ట్టే అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో అసలు ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది.

Balayya

మేటర్ ఏంటంటే.. స్క్రిప్టు విష‌యంలో బాల‌య్య పూర్తి స్థాయిలో సంతృప్తి చెంద‌లేద‌ట. అందుకే.. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకొన్నార‌ని టాక్. బాలయ్య ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడి కోసం చూస్తున్నారట. బాలయ్యకు నచ్చే డైరెక్టర్ దొరికే వరకు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లదు. దీంతో బాలయ్య నట వారసుడు ఎంట్రీ మరింత ఆలస్యం అవుతోంది. ఇప్పుడు బాలయ్య మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందుచేత బాలయ్య ఫోకస్ అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది తప్పా ఆదిత్య 999 పై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. మరి.. మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడో.?

Balayya

Leave a Reply