గాజా – పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. ఈ పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్‌పోర్ట్‌లు అక్కడ అధికారులు స్వాధీనం చేసుకుని బంధించారు.. దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో నెల రోజులుగా బందీలుగా ఉంటున్నారు
గత రాత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నేతృత్వంలో రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్‌లో కార్మికులను రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఈ విషయం దర్యాప్తులో ఉందని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కార్మికులకు భద్రత కల్పించాలని ఇజ్రాయెల్ అధికారులను కోరినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.