Cricket Tournament | మీ సావు.. మీరు సావండి..!

Cricket Tournament | మీ సావు.. మీరు సావండి..!
- మీతో మాకేంటి..?
- మేం టీ20 వరల్డ్ కప్‌లో ఆడతాం
- తేల్చిచెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
Cricket Tournament | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : వచ్చే నెల 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ టోర్నీలో బంగ్లాదేశ్(Bangladesh) పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో మ్యాచ్‌లు ఆడమని మొండికేసి కూర్చుంది.
బంగ్లాదేశ్ దౌత్యపరమైన, క్రికెట్ పరమైన మద్దతు కోసం పాకిస్థాన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నమెంట్‌ను బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను పీసీబీ వర్గాలు తోసిపుచ్చాయి. బంగ్లాదేశ్‌తో మాకేమి సంబంధం లేదని, మేం టీ20 వరల్డ్ కప్ ఆడుతామని తేల్చి చెప్పింది.

టోర్నమెంట్ నుంచి వైదొలగే ఆలోచన తమకు లేదని పీసీబీ ఖరాఖండిగా ప్రకటించింది. అయినప్పటికీ, పాకిస్థాన్ మ్యాచ్‌లు పూర్తిగా శ్రీలంకలోనే షెడ్యూల్ కావడంతో, టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని పీసీబీ స్పష్టం చేసింది.
