సంగారెడ్డి – ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో నేడు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు గులాబీ బాస్. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్సీ వస్తుంది. పాత వారికి రెన్యూవల్ చేస్తారా.. లేక కొత్త వారికి ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ రోజు కేసీఆర్ తో పార్టీ నేతల భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే, ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీశ్ రావు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారని అని టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పే అవకాశం ఉంది.