నేటి రాశిఫలాలు 7.03.25

మేషం : ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులు కీలక సమాచారం అందుకుంటారు.

వృషభం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు.

మిథునం: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరాశ. కళాకారులకు సమస్యలు.

కర్కాటకం: గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బా:ీ లు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి.

కన్య: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది.

తుల: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవేత్తలకు కొత్త సమస్యలు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు శుభవార్తలు.

ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు శ్రమాధిక్యం.

మకరం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

కుంభం:రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో విశేష ఆదరణ. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *