90 percent | ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు..

90 percent | ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు..

90 percent | ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో కనీసం ఒక్క వైద్యులు లేరు. 16 మంది ఏ ఎంఎంలు ఉండవలసిన చోట కేవలం 8 మంది(8 people) మాత్రమె ఉన్నారు. సగం పోస్టులు ఖాలీలు ఉన్నాయి. ప్రజలకు ఏవిధంగా వైద్యం అందుతుందో అధికారులే చెప్పాలి.

ఉన్నటువంటి సిబ్బంది సైతం సమయపాలన పాటించ‌రు. తరచుగా విధులకు హాజ‌రు కావ‌డం లేదు. మండలంలో ప్రభుత్వ వైద్యం ఆగమ్యగోచరంగా తయారైంది. ప్రాధమిక ఆరోగ్యకేంద్ర భవనాలు నిర్మించారు కానీ, వైద్యులను నియమించాకపోవడంతో ఆ ప్రాంత గిరిజనులకు, అధివాసులకు ప్రభుత్వ వైద్యం అంద‌ని ద్రాక్షనే. కెరమెరి మండలంలో దాదాపుగా 90 శాతం(90 percent) గిరిజన ప్రాంతమే ఉన్నది .జనాభాలో అధిక శాతం గిరిజనులే ఉన్నారు.

గిరిజనులు, అధివాసుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనపడితుంద‌న్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ తెగలకోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నా క్షేత్రాస్థాయిలో మాత్రం క‌నీస వైద్యం అందించటంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనులు ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి.

ప్రభుత్వం గిరిజనులకు అందుబాటులో వైద్యం అందించాలని సబ్ సెంటర్ వారిగా మెడికల్ లీగల్ హెల్త్ ప్రొవైడర్(medical legal health provider) పేరిట నియామకాలు చేపట్టిన వారు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో ప్రజలకు తెలియ‌ద‌న్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు గిరిజనుల వైద్యం కోసం కేటాయిస్తున్నా, వేల రూపాయల వేతనాలు తీసుకున్నా, విధులను విస్మరిస్తున్నారు.

జిల్లాలో 21 ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా అందులో 44 మంది వైద్యులు సేవలు అందించవలసి ఉంది. కానీ కేవలం 24 మంది వైద్యులు పనిచేస్తున్న ట్లు సమాచారం. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలు పడకేసిశాయి. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి వైద్య సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply