గురుకుల పాఠశాలలో కలకలం..

గురుకుల పాఠశాలలో కలకలం..
- విద్యార్థినుల మధ్య వివాదం..
- 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- ఐరన్ మాత్రలు మింగిన బాలిక
గూడూరు, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.
పాఠశాలలో చదువుతున్న ఇద్దరు 8వ తరగతి విద్యార్థినుల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో, ఒక విద్యార్థిని మనస్తాపానికి గురై 16 ఐరన్ మాత్రలు మింగినట్లు సమాచారం. ఘటనను గమనించిన ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ఆమెను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పెషల్ ఆఫీసర్ సునీత తెలిపారు.
