850 points | మూడు రోజుల లాభాలకు బ్రేక్…

850 points | మూడు రోజుల లాభాలకు బ్రేక్…

  • రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరి…
  • సెన్సెక్స్‌ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల లాస్…

850 points | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేక, వరుసగా మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 250 పాయింట్లను కోల్పోయింది.

దీంతో మదుపరుల సంపద ఒక్కరోజే దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. బ్యాంకింగ్‌, లోహ, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల్లో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో సూచీలు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్‌ 83 వేల స్థాయి దిగువకు పడిపోయింది. నిఫ్టీ 25,600 వద్ద కొనసాగుతోంది. ఉదయం సెన్సెక్స్‌ 235 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి.

850 points |
850 points |

Leave a Reply