రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉద్యమానికి 80 వసంతలు.
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉద్యమానికి 80 వసంతలు.
జిల్లా లో ఎస్ టీ యు.80 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : స్వాతంత్రం రాకముందు ఏర్పడిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల హక్కుల సాధన, పరిరక్షణ కొరకు వారి సేవలో నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తూ వారికి రావలసినటువంటి అన్ని అవసరాలను ప్రభుత్వంతో చర్చల ద్వారా చర్చల కోసం రాష్ట్ర నాయకత్వం అందుబాటులో ఉందని ఎస్ టీ యు జిల్లా అధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్జీయూ కార్యాలయంలో అధ్యక్షుడి నిర్వహణలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్ రాష్ట్ర సాంకేతిక కమిటీ కన్వీనర్ గిరిబోయిన నాగేంద్ర, మాజీ జిల్లా అధ్యక్షుడు మౌలాలి, అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావుల నిర్వాహనలో 80 వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎనిమిది మంది విశిష్ట అతిథులకు ఘనంగా అభినందించి సన్మాన కార్యక్రమం చేపట్టారు.

సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు సుబ్బరాయుడు లక్ష్మీనారాయణ, జయప్రకాష్, లగిశెట్టి సుబ్బయ్య, తిరుపతయ్య లు ఉద్యమాల ఊపిరిని గురించి వివరించారు. డి సిఈబి చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, బయాలజీ ఉపాధ్యాయుడు నరహరి నాగేశ్వర్ రెడ్డి, ఎల్లా సుబ్బయ్యలు రెడ్డి,లు సంఘ నిర్మాణాన్ని గురించి తెలిపారు.ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ముందు ఉంటుందన్నారు. వీరందరికీ ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీలుగా పోచం రెడ్డి సుబ్బారెడ్డి, కత్తి నరసింహారెడ్డి వంటి వారు రాష్ట్రస్థాయిలో శాసనమండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై గళం విప్పారన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అందరి సహకారంతో మరోసారి ఎస్టియు తన సత్తా చాటుకుంటుందని పేర్కొన్నారు. జిల్లాలో సమస్యలకోసం పోరాట బాటలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుందన్నారు.
మొదట ఎస్టియు జెండాను ఆవిష్కరించరు.గత కొన్ని సంవత్సరాలుగా సంఘానికి నిస్వార్థ సేవ అందించిన సీనియర్ నాయకులకు అభినందించారు. స్వాతంత్రానికి పూర్వమే ఈ సంఘం ఆవిర్భవించిన తీరు,సంఘ చరిత్ర, సంఘ సేవ మొదలగువాటి విషయాలపై వివరించారు. ఈ సందర్భంగా నాయకులు సంఘం నిర్దేశించిన అన్ని ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని ఉపాధ్యాయ సేవలో అంకితం అవుతావని ప్రమాణం చేశారు.కార్యక్రమంలో సుబ్బయ్య, ప్రభాకర్, మల్లేశ్వర్ మల్లికార్జన నాగేశ్వర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాసరెడ్డి, నాగేంద్ర కుమార్,సిరివెళ్ల అమీర్, గురునాథ్, ప్రసాదరావు,ప్రసాద్ రెడ్డి, తిరుపతయ్య ఎల్లా సుబ్బయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
