7SeaterCar | రూ.5.65 లక్షలకు మార్కెట్‌లోకి నిస్సాన్ గ్రావైట్

7SeaterCar | రూ.5.65 లక్షలకు మార్కెట్‌లోకి నిస్సాన్ గ్రావైట్
7SeaterCar | మద్య తరగతి కోసం సరసమైన 7-సీటర్ ఎంపీవీ
తొలి 5,000 బుకింగ్‌లకు ప్రత్యేక ధర
5 ఏళ్ల ఉచిత సర్వీస్ – అదనపు ప్రయోజనాలు
5.55% వడ్డీతో ఫైనాన్స్ ఆఫర్
ఆటో మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా గ్రావైట్
7SeaterCar | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రతీ ఒక్కరికి సొంతింటి తోపాటు ఒక కారు ఉండాలనే కోరిక ఉంటుంది. ఒక చిన్నపాటి కుటుంబం కలిసి వెళ్లేలా కారు కొనుక్కోవాలని చూస్తున్నారు. అయితే కార్ల ధరలు చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యుడి బడ్జెట్‌కు అందుబాటులో ఉండేవి తక్కువగా ఉంటాయి. ఇలాంటి మధ్యతరగతి వారి కోసం నిస్సాన్ ఇండియా ఒక కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యంత సరసమైన ధరకే ‘నిస్సాన్ గ్రావైట్’ (Nissan Gravite) MPVని మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెనాల్ట్-నిస్సాన్ కూటమికి చెందిన సుప్రసిద్ధ CMF-A+ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కారు, ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం రాత్రి దీనిని లాంఛ్ చేశారు.

నిస్సాన్ గ్రావైట్ ప్రారంభ ధరను కంపెనీ కేవలం రూ. 5.65 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. సాధారణంగా ఈ ధరకు ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు మాత్రమే వస్తుంది, కానీ నిస్సాన్ ఏకంగా ఒక పూర్తి స్థాయి 7-సీటర్ కారును అందిస్తుండటం విశేషం.ఈ ప్రత్యేక ధర కేవలం మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అదనపు ప్రయోజనాలు: ఈ తొలి కస్టమర్లకు 5 ఏళ్ల పాటు ఉచిత సర్వీస్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా, ‘నిస్సాన్ లాయల్టీ ప్రోగ్రామ్’ ద్వారా కేవలం 5.55% వడ్డీ రేటుతో ఫైనాన్స్, ఎక్స్‌క్లూజివ్ అప్‌గ్రేడ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

