71 war ships : ఇదీ భారత్ సత్తా Andhra Prabha SPOT News

71 war ships : ఇదీ భారత్ సత్తా Andhra Prabha SPOT News
విశాఖ తీరంలో ఓడల జాతర
మిలాన్ – 2026 సక్సెస్
72 దేశాలు హాజరు
అంతర్జాతీయ స్థాయిలో భారత సముద్ర శక్తి ప్రదర్శన
యునైటెడ్ త్రూ ఓషన్స్ నినాదంతో ఐక్యత సందేశం
( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో)
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నౌక (INS సుమేధ) ద్వారా నౌకాదళ విన్యాసాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ఈ అంతర్జాతీయ స్థాయి వేదికపై అతిథిగా హాజరై విన్యాసాలను తిలకించారు.

ఈ ‘మిలాన్ -2026’ (MILAN 2026) విన్యాసాల్లో దాదాపు 70కి పైగా యుద్ధనౌకలు, 50 విమానాలు , సుమారు 72 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా (USA), రష్యా, ఆస్ట్రేలియా, జర్మనీ (మొదటిసారి), ఫిలిప్పీన్స్, యూఏఈ (UAE) సహా 72 దేశాలు పాల్గొన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, రిషస్ వంటి మిత్ర దేశాలు తమ యుద్ధనౌకలతో ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి.

భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాని కి చైనా, పాకిస్థాన్ , టర్కీ దేశాలను ఆహ్వానించలేదు. సముద్రంపై ఆరు వరుసలలో నిలబడిన దేశీయ, విదేశీ యుద్ధనౌకల మధ్య రాష్ట్రపతి నౌక ప్రయాణిస్తూ గౌరవ వందనం స్వీకరించారు. . నేవీ హెలికాప్టర్లు , యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. “యునైటెడ్ త్రూ ఓషన్స్” (సముద్రాల్లో ఐక్యత) అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.
71 war ships |































CLICK HERE TO READ MORE : AP Deputy CM | పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం
