6stotras | ఇవి చదువుకోండి చాలు..

6stotras | ఇవి చదువుకోండి చాలు..
6stotras | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉరుకులు పరుగుల జీవితాలలో ఉదయం పూట ప్రశాంతంగా అరగంట కూర్చుని పూజ చేసుకునే టైం ఉద్యోగులకు కష్టమే. కాస్త దీపం వెలిగించుకునో, దేవుడికి దండం పెట్టుకునో ఆఫీసులకు బయల్దేరడమే. అయితే, పూజ చేసుకోలేకపోతున్నామనే బాధవద్దు. ప్రయణంలోనైనా సరే మనసులో ఈ స్తోత్రాలను మననం చేసుకుంటే చాలు. అవేమిటో చూద్దాం.
ఉదయం ప్రశాంత సమయంలో చదివే స్తోత్రాలు మన మనసును స్థిరపరచి, ఆలోచనలకు శుభదిశను ఇస్తాయి.
నిర్లక్ష్యంగా చదివిన ఎన్నో మంత్రాలకంటే శ్రద్ధతో చదివిన ఒక స్తోత్రమైనా శ్రేష్ఠం.
6stotras | గణేశ స్తోత్రం
ఏ పని ప్రారంభించినా ముందు గణపతిని స్మరించాలి.
గణేశ స్తోత్రం చదవడం వల్ల అడ్డంకులు తొలగుతాయి మనసుకు ధైర్యం కలుగుతుంది.
పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి.
విద్యార్థులు, ఉద్యోగులు తప్పక చదవాల్సిన స్తోత్రం ఇది.

6stotras | శ్రీ గణపతి స్తోత్రమ్
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్ధ సిద్ధయే ॥ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం ॥
లంబోధరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం చ ద్వాదశంతు గజాననం ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్న భయంతస్య సర్వసిద్ధికరం పరం ॥
విద్యార్థీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రా న్మోక్షార్థీ లభతే గతిం ॥
జపేద్గణపతి స్తోత్రం షడ్ఫిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ||
అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యాభవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥
6stotras | గాయత్రీ మంత్రం

ఉదయం చదవడానికి అత్యంత పవిత్రమైన మంత్రం. గాయత్రీ మంత్రం ప్రయోజనాలు బుద్ధి వికాసం కలుగుతుంది. జ్ఞాన మార్గంలో ముందడుగు పడుతుంది. మనసు స్థిరంగా ఉంటుంది. రోజూ కనీసం మూడు సార్లు చదవడం శుభప్రదం.
ఓం భూర్భవః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
6stotras | శివ పంచాక్షరి స్తోత్రం

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారాయ నమశ్శివాయ ॥
మందాకినీ సలిల చందన చర్చితాయ, నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ, తస్మై “మ” కారాయ నమశ్శివాయ ॥
శివాయ గౌరీ వదనారవింద, సూర్యాయ, దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై “శి” కారాయ నమశ్శివాయ. ॥
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది, మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ, తస్మై “వ” కారాయ నమశ్శివాయ ॥
యక్షస్వరూపాయ జటాధరాయ, పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై “య” కారాయ నమశ్శివాయ ॥
పంచాక్షర మిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ, శివలోక మవాప్నోతి శివేన సహమోదతే
“నమశ్శివాయ” అనే నామం శాంతికి మూలం. ఈ స్తోత్రం వల్ల మనసులో కలతలు తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి ఆత్మబలం పెరుగుతుంది. శివభక్తులు ఉదయం తప్పక జపించాలి.
6stotras | విష్ణు సహస్రనామ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
యన్య ద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ విఘ్నం నిఘ్నంతి నతతం విష్వక్సేనం తమాశ్రయే ||
వ్యాసం వసిస్థనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ వరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్టవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః |
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే నదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ఠనే ॥
యన్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥
॥ ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే ॥
లోక సంరక్షకుడైన విష్ణుమూర్తిని ఉదయం స్మరించడం మహా ఫలదాయకం. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల కుటుంబంలో శాంతి నిలుస్తుంది జీవనంలో స్థిరత్వం కలుగుతుంది
భయాలు తొలగుతాయి. ఇది గృహస్థులకు ఎంతో శ్రేయస్కరం.
6stotras | హనుమాన్ స్తోత్రం

హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః !
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః! ద్వాదశైతాని నామాని కపీంద్రశ్చ మహాత్మనః! ఉదధి క్రమణశ్చైవ సీతాశోకవినాశకః ! లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవశ్చ దర్సాహా!
స్వాపకాలే పఠేనిత్యం యాత్రాకాలే విశేషతః !
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయి భవేత్!
శక్తి, ధైర్యానికి ప్రతీక హనుమంతుడు. ఈ స్తోత్రం ప్రయోజనాలు భయాలు దూరమవుతాయి.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసమయాల్లో ధైర్యం కలుగుతుంది
పరీక్షలు, ముఖ్యమైన పనుల ముందు చదవడం మంచిది.
6stotras | శ్రీ సరస్వతీ స్తుతి

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సా మాం పాతు సరస్వతి
యాకుందేందు తుషారహార ధవళాయాశుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యాశ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా॥
పాశాంకుశ ధరా వాణీ వీణా పుస్తకధారిణీ। మమవస్తే పేసేన్నిత్యం దుగ్ధకందేందు నిర్మాలా
చతర్ధశము విద్యాసు రమతే యా సరస్వతీ చతుర్దశసు లోకేషు సామేవాచి వసేత్సదా
వాణీం పూర్ణనిశాకరోజ్జ్వల ముఖీం కర్పూర కుంద ప్రభాం. చంద్రార్ధాంకిత మస్తకాం నిజ కరై స్పంచిభ్రతీ మా దరాత్ వర్ణాకుక్షగుణం సుధాద్య కలశం విద్యాంచ ఉత్తుంగ స్తనీం దివ్యై రాభరణై ద్విభూషిత తనుం సింహాది రూఢాం భజే
విద్య, జ్ఞానం, కళలకు అధిష్ఠాత దేవత సరస్వతి. ఈ స్తోత్రం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది
జ్ఞాపకశక్తి బలపడుతుంది మాటల్లో మాధుర్యం వస్తుంది. ఉదయం తప్పక చదవాలి.
ఉదయం స్తోత్రాలు చదవడంలో ముఖ్యమైన నియమాలు :
తొందరపడకుండా చదవాలి, మొబైల్ దూరంగా ఉంచాలి, అర్థం తెలుసుకుని చదవడం మంచిది
రోజూ ఒకే సమయంలో చదివితే మంచి ఫలితం ఉంటుంది.
ఉదయం చదివే స్తోత్రాలు మన జీవితానికి రక్షణ కవచంలాంటివి.వాటివల్ల మనసుకు శాంతి, ఆలోచనలకు స్పష్టత, జీవితానికి శుభారంభం లభిస్తాయి. రోజూ కొద్ది సేపు భగవంతుని స్మరణకు కేటాయిస్తే, ఆ రోజు మొత్తం ప్రశాంతంగా సాగుతుంది. భక్తితో చదివిన ఒక్క స్తోత్రం కూడా జీవితాన్ని మారుస్తుంది.
CLICK HERE TO READ save nature | ప్రకృతి-వికృతి
ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా… విధులకన్నా విశ్వాసమే గొప్పది. ఆడంబరాల కన్నా ఆత్మశుద్ధే ముఖ్యము. భక్తితో చేసే చిన్న పూజ, అహంకారంతో చేసిన పెద్ద యజ్ఞం కన్నా గొప్పది.
ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా… విధులకన్నా విశ్వాసమే గొప్పది. ఆడంబరాల కన్నా ఆత్మశుద్ధే ముఖ్యము. భక్తితో చేసే చిన్న పూజ, అహంకారంతో చేసిన పెద్ద యజ్ఞం కన్నా గొప్పది.
“శ్రద్ధతో చేసిన పూజే దేవుని మనస్సుని చేరే మార్గం.” ఇది గుర్తుంచుకోవాలి. పూజ, వ్రతం ఆచరించడం అంటే మన ప్రతిష్టను ప్రకటించుకునే శుభకార్యం కాదు. కేవలం పూజ ముందు కూర్చుని, మనస్సు ఏకాగ్రత పూజ మీద లేకుండా, ఇతరులను పలకరించడాలు, ఆహ్వానించడాలు చేయకూడదు.