60 lakhs | 60 లక్షలు పరిహారం కోసం…..

60 lakhs | 60 లక్షలు పరిహారం కోసం…..

  • ఐదు నెలలుగా ప్రదక్షణ.

60 lakhs | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : 60 లక్షలు నష్టపరిహారం కోసం ఐదు నెలలగా ప్రదక్షిణ చేస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు బిట్ 1బీ సాగర మాల ప్రాజెక్ట్ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రైతు ఉద్యమ నాయకులు తిన్నెలపూడి సిద్దు ఆధ్వర్యంలో ఆరు మంది రైతులు తాసిల్దార్ స్వప్నకు వినతి పత్రాన్ని అందజేశారు.

భూములు కోల్పోయి నష్ట పరిహారం కోసం అగచాట్లు ఏమిటని రైతులు ప్రశ్నించారు. త్వరగా పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక పరమైన సమస్య ఉన్నందువల్ల త్వరగా పరిష్కారం చేస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ తో మాట్లాడుతామని తాసిల్దారు సమాధానం చెప్పారు. కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply