5DaysBefore | చట్టం ఎవరి చుట్టం..? నిద్రావస్థలో పోలీస్ వ్యవస్థ

5DaysBefore | చట్టం ఎవరి చుట్టం..? నిద్రావస్థలో పోలీస్ వ్యవస్థ
5DaysBefore | పోలీస్ స్టేషన్లలో సామాన్యులకు దక్కని న్యాయం
నిర్లక్ష్యానికి బలైన అమాయక ప్రాణాలు
అడ్వకేట్ స్వప్న హత్యతో వెలుగులోకి వచ్చిన వైఫల్యం
పోలీసుల అలసత్వం కూడా ఒక అదృశ్య నేరమేనా?
మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళన
సీపీ సజ్జనార్ స్పందన ఎక్కడ?
5DaysBefore | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్, : సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం, చట్టాన్ని అమలు చేయడం, ప్రజల ప్రాణాలు–ఆస్తులను రక్షించడం పోలీస్ వ్యవస్థ యొక్క బలమైన బాధ్యత. అలాంటి కీలక వ్యవస్థపైనే ఇప్పుడు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది.

ఎవరికైనా ఆపద వస్తే చివరి ఆశగా పోలీస్ స్టేషన్‌కి పరుగెడతారు. కానీ అక్కడే నిర్లక్ష్యం, అలసత్వం, మౌనం ఎదురైతే బాధితులు ఇంకెక్కడికి వెళ్లాలి..?
న్యాయం కోసం వచ్చిన న్యాయవాదులకే పోలీస్ స్టేషన్‌లో భద్రత లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు భయంకరంగా నిలుస్తోంది.
ఇటీవల రంగారెడ్డి జిల్లాలో జరిగిన అడ్వకేట్ స్వప్న హత్య ఈ వ్యవస్థలోని తీవ్రమైన వైఫల్యాన్ని వెలుగులోకి తెచ్చింది. హత్యకు ముందే పోలీసులకు ఫిర్యాదు అందినా, సకాలంలో స్పందించకపోవడం వల్ల ఒక అమాయక ప్రాణం బలైంది. ముందే చర్యలు తీసుకుని ఉంటే ఈ హృదయవిదారక ఘటన జరిగేదే కాదు కదా..?
స్వప్నను హత్య చేసిన ఆమె అన్నది ఎంత బాధ్యుడో, అదే స్థాయిలో అలసత్వం వహించిన పోలీసులకూ నైతిక బాధ్యత తప్పదని సీనియర్ అడ్వకేట్ లలితారెడ్డి స్పష్టంగా తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఒక రకమైన అదృశ్య నేరమే అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆమె ఆంధ్రప్రభకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని సంచలనాత్మక, ఆలోచనాత్మక విషయాలు వెల్లడించారు.
ఆ నిజాలు తెలుసుకోవాలంటే… ఈ కింది వీడియోను చూడండి.
