4ashrams | ఏడు దశలు

4ashrams | ఏడు దశలు
భారతీయ జీవన విధానంలో, ప్రతివ్యక్తి జీవితం వ్యవస్థితమై, ప్రయోజన భరితమై సాగేందుకు జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సంన్యాసములంటూ నాలుగు ఆశ్రమాలు(Four ashrams)గా విభాగించారు. వ్యక్తి ప్రస్థానం సజావుగా సాగేందుకు ఏర్పరచిన చతురాశ్రమజీవితంలో చివరగా.. మోక్షాన్ని సాధించడమే ప్రయోజనంగా భావించారు, ఋషులు. బ్రహ్మచర్యాశ్రమంలో.. గురుకులంలో బ్రహ్మచర్యాన్ని వ్రతంగా స్వీకరించి, గురువును సేవిస్తూ(By serving the Guru), అన్ని ప్రలోభాలకు దూరంగా, విద్యను అభ్యసించడం, గృహస్థాశ్రమంలో విద్యను సాధికారికంగా, లోకకల్యాణానికై విని యోగించి, ధర్మబద్ధంగా సంపదను సృజించి వినియోగించడం, అర్హులకు విద్యను అందించడం, సంతానాన్ని కని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం, అతిథి అభ్యాగతులను ఆదరించడం, దైవ, ఋషి, పితృ, మనుష్య ఋణాలను తీర్చుకోవడం.. వానప్రస్థంలో భౌతిక జీవితానికి దూరంగా నిర్లిప్తతను పొంది లౌకిక వ్యవహారాలలో అవసరానుగుణంగా భావి తరాలకు మార్గదర్శన(Guidance for future generations) చేయడం, సన్యాసాశ్రమంలో వీటన్నింటినీ త్యజించి మోక్షపథంలో సాగిపోవడం ధర్మాలుగా చెప్పారు. అన్నింటిలోనూ గృహస్థాశ్రమం ఉన్నతమైనదిగా పరిగణించబడింది.
దీనినే ఈనాటి పారిశామిక వేత్తల జీవితానికి అన్వయిస్తే.. మొదటి దశలో సంబంధిత రంగంలో అవసరమైన విద్యను, నైపుణ్యాలను, అనుభవాన్ని సంపాదించడం.. రెండవదశలో కన్న కలలను సాకారం చేసుకునే దిశలో శ్రమించడం, స్పష్ట మైన లక్ష్యాల(Clear goals)తో పరిశ్రమలను స్థాపించి ఉపాధి కల్పించడం.. సంపదను పెంచు కోవడం, పంచుకోవడం.. మూడవదశలో మరోతరం నాయకులను తయారు చేయడం, చివరగా వ్యవహా రాలను దక్షులైన వారికి అప్పగించి ఆనందంగా జీవితాన్ని(Happy life) గడిపేయడంగా.. చెప్పుకోవచ్చు.
4ashrams | ధైర్య సాహసోపేతమైన ప్రయాణంలో
చతురాశ్రమ అనుసరణ ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుస్తుంది. దానికి సంకల్పబలం, విజ్ఞానం, వివేచన క్రియాశీలతలు, సంతోషం సంతృప్తి. వ్యష్టి నుండి సమష్టికి సంవ్యాప్తం కావడం, మానసిక సమతుల్యత(Mental balance), ఆత్మ, సంయమనత.. ఈ ఏడూ ఉపకరణాలుగా ఉపకరిస్తాయి. షేక్సిపియర్ తన “యాజ్ యు లైకిట్” అనే పుస్తకంలో.. పుట్టిన నుండి మరణం వరకు ఉండే జీవితాన్ని ఏడు దశలుగా చెప్పాడు. పసితనం, విద్యార్థిదశ, ప్రేమికుల దశ, ధైర్య సాహసోపేతమైన ప్రయాణంలో ప్రమాదాలకు(Accidents in travel) ఎదురీది సంపదను సృష్టించడం, స్థిరంగా నిలకడగా న్యాయబద్ధంగా ఆడంబరంగా జీవించడం, వృద్ధాప్యం, తిరిగి శైశవస్థితిని పొంద డంగా.. చెప్పారాయన.

జీవిత ప్రయోజనమైన మోక్షసాధనలోనూ ఏడు దశలను చూడవచ్చు. పరమా నందయ్య శిష్యుల కథలో.. స్నానానికి వెళ్ళిన పదిమంది శిష్యులూ నదినుండి బయ టకు వచ్చాక ఎవరు లెక్కించినా తొమ్మిదిమండే(Even if you count, it’s nine) వస్తున్నారు. దానితో ఒకరు నదిలో మునిగిపోయారని నిశ్చయించుకొని ఏడుస్తున్నారట. బాటసారి యొకరు వారి శోక కారణం తెలుసుకొనిలెక్కించి పదిమంది ఉన్నట్లుగా నిరూపించి, పదవవానివినీవే అనే సత్యాన్ని తెలియచేయగా అందరూ శోకాన్ని మాని సంతృప్తితో వెళ్ళారట. ఈ కథలోని సారాన్ని ఏడు అవస్థలు(Seven stages)గా చూడవచ్చు.
అజ్ఞానావస్థ(ignorance).. తనను తాను లెక్కించుకోలేక పోవడం), ఆవరణావస్థ…(పదవవాడు లేడని భావించడం), విక్షేపావస్థ. (పదవవాడు నదిలో మునిగిపోయాడని నిశ్చయించుకొని రోదించడం), పరోక్షజ్ఞానం.. (పరులచేత పదవవాడివి నీవే అనే విశ్వాసాన్ని పొందడం), ఆపరోక్షజ్ఞానం.. (తనకు తానే పద వాడినని గుర్తించడం), శోకనివృత్తి.. (రోదన మానివేయడం).. సంతృప్తి.. (అంద రమూ ఉన్నామని ఆనందించడం). అజ్ఞానావస్థలో “స్వస్వరూపాన్ని మరచిపోతాము”.. ఆవరణావస్థలో “స్వస్వ రూప స్పృహను(Self-consciousness) కోల్పోతాము.. విక్షేపావస్థలో శోకాన్ని ఆదరిస్తాము. పరోక్షజ్ఞానం వల్ల.. గురుబోధతో విశ్వాసాన్ని పొంది ఆవరణ నుండి బయటకు వస్తాము.
4ashrams | ఏడు దశ లనూ అధిగమించి
అప రోక్షజ్ఞానంవల్ల అనుభవ పూర్వకమైన స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. దానితో శోక నివృత్తి కలిగి సంతృప్తి(Satisfaction with the relief of grief)తో కూడిన బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తాము. అజ్ఞాన, ఆవరణ, విక్షేప అవస్థలు భ్రమ వల్ల కలిగితే.. పరోక్ష, అపరోక్ష జ్ఞానాలు, శోకనివారణ, సంతృప్తి సత్యాన్ని గుర్తించడం ద్వారా లభిస్తాయి. ఏయే ఆశ్రమాలలో ఏయే కర్తవ్యాలు నిర్దేశితమయ్యాయో.. ఆయా దశలలో వాటిని నియమబద్ధంగా నిర్వహిస్తే ఏడు దశ లనూ అధిగమించి అంతిమ ప్రయోజనమైన మోక్షాన్ని(The ultimate goal is salvation) సాధించగలమని ఋషులు బోధిస్తున్నారు. ప్రతియొక్కరూ భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను సిద్ధింపచేసే ఆశ్రమ ధర్మాలను పాటించి ఉన్నతస్థితిని పొందాలన్నదే ఆకాంక్ష.
- పాలకుర్తి రామమూర్తి
