నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం…

నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం…

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఆదివారం సయ్యద్ షా ఖాజా షఫీ యుల్లాహుస్సేని బందా నవాజీ రహమతుల్లా అలై 33 వ ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువు రఫీ కా అలాం ఈ సందర్భంగా మాట్లాడుతూ 33 సంవత్సరాల నుండి ఉరుసు ఘనంగా నిర్వహిస్తున్నామని అదేవిధంగా గంధం తో మేళ తాళాలతో చిన్న మసీదు దగ్గర నుండి పెద్ద మసీదు దర్గా షరీఫ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఉరుసు మహోత్సవం ముజావర్లు సయ్యద్ సర్దార్, పఠాన్ అల్లావుద్దీన్ ఖాన్ షేక్ సుభాని మేస్త్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ ఉరుసు మహోత్సవ సందర్భంగా ఆదివారం భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారని షేక్ సుభాని మేస్త్రి తెలిపారు.

ఈ సందర్భంగా షేక్ సుభాని మేస్త్రి మాట్లాడుతూ సయ్యద్ షా ఖజా షఫీ ఉల్లా హుస్సేని బంధా నవాజీ రహమతుల్లా 33 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మొట్టమొదటి సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆదివారం 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply