30-Year-Dream-Veligonda-Project : గొడ్డ‌లి గ్ర‌హ‌ణం వీడింది Andhra Prabha Top News

30-Year-Dream-Veligonda-Project : గొడ్డ‌లి గ్ర‌హ‌ణం వీడింది Andhra Prabha Top News

  • వెలిగొండ జాతికి అంకితం
  • క‌రువునేల‌లో కృష్ఱ‌మ్మ చిందులేస్తుంది
  • న‌ల్ల‌మ‌లకు గోదార‌మ్మ వ‌స్తుంది
  • వ‌చ్చే ఏడాది పోల‌వ‌ర‌మూ జాతికి అంకితం
  • 30 ఏళ్ల క‌ల సాకార‌మైంది
  • సీఎం చంద్ర‌బాబు హ‌ర్షాతిరేకం
  • వెలిగొండ సుబ్బ‌య్య త‌న‌య‌లు మ‌హానందం

(ఆంధ్ర‌ప్ర‌భ‌, మార్కాపురం ప్ర‌తినిధి)

2019లో గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2024లో ఆ గ్రహణం వీడింది గత ప్రభుత్వంలో కేవలం 2.7 శాతం పనులు మాత్రమే చేశారు. విలువైన కాలాన్ని గాలికి వదిలేశారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా జీఓల పేరుతో మోసం చేశారు. ప్రాజెక్టు పనులు చేయకుండా ఎన్నికలకు నెల ముందు జాతికి అంకితం చేసి మోసం చేశారు : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో పీఎం చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్ర‌బాబు ప్రారంభిచారు. జ‌ల‌హార‌తి ప‌ట్టారు. అనంత‌రం జాతికి అంకితం ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుకు 30 ఏళ్ల క‌ల ఫ‌లించింద‌ని హ‌ర్తం వ్య‌క్తం చేశారు. .

గొడ్డ‌లి పార్టీని ప్ర‌శ్నించండి

మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ఆయ‌ర మాట్లాడుతూ, రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్ లో ఉంచుకుని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సిగ్గులేని గొడ్డలి పార్టీని ఏమనాలి? అని ప్ర‌శ్నించారు. ఫేక్ డ్రామాలు, సినిమా సెట్టింగులతో ప్రజల్ని, రైతుల్ని మోసం చేసిన వ్యక్తుల్ని ఏం చేయాలి?రెండు సొరంగాలు మొత్తం తిరిగానని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎందుకు ఇవ్వలేదు? వారి హయాంలో సొరంగాల్లో టీబీఎం యంత్రం ఇరుక్కు పోయింది. సొరంగం పనులు పూర్తి కాలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించి పనులు పూర్తి చేసి ఇప్పుడు నీళ్లు ఇచ్చాం, ఫేక్ మాటలు చెప్పే వ్యక్తుల్ని, మోసం చేసిన వారి గురించి ఈ ప్రాంత ప్రజలు నిలదీయాలి, అని సీఎం చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు.

అన్నీ బుకాయింపులే

పనులు చేసేశామని బుకాయించటం తప్పు. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన నేను చేశాను. 11 ఏళ్ల పాటు వైఎస్ఆర్ , జగన్ అధికారంలో ఉండి పనుల్ని చేయలేకపోయారు ఇంకా రూ.1900 కోట్ల పనులు చేస్తే మొత్తం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. చరిత్రను ఎవరూ తిరగరాయలేరు. ఫేక్ ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొడతాం. చెడును ఖండించాలి. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతున్నాను దేశం ఎదుర్కోంటున్న సమస్యను నదుల అనుసంధానం ద్వారానే పరిష్కరించగలం, అని సీఎం వివ‌రించారు.

పోల‌వ‌ర‌మూ అంకితం ఇస్తాం

పోలవరం రాష్ట్రానికి జీవనాడి. దీనిని 2027 మార్చికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం 2028లో కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందాం. గోదావరి నీరు నల్లమల సాగర్ వరకూ రావాలి. దానికి మేం అన్ని విధాలా కృషి చేస్తున్నాం . దక్షిణ భారత్ లో గోదావరి- కావేరి అనుసంధానం చేయాలి. మహానది- గంగానది కూడా అనుసంధానిస్తే దేశం సుభిక్షం అవుతుంది.వచ్చే 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ఇచ్చాం . పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకెళ్తున్నాం. ఆ తదుపరి వంశధార వరకూ తీసుకెళ్తాం కరవును ఎదుర్కోవాలంటే ప్రతీ వర్షపు నీటి చుక్కనూ పొదుపు చేసి భూగర్భజలాలుగా మారుద్దాం, అని సీఎం పిలుపు ఇచ్చారు.

రైతుల క‌ల నిజం చేశాం

చంద్రబాబు అనేనేను వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల కలల్ని నిజం చేశాను. భవిష్యత్తుకు భరోసా ఇచ్చాను. మార్కాపురం జిల్లాను ఇచ్చాం. మాట ఇచ్చాం- మాట నిలబెట్టుకున్నాం .రాయలసీమ హార్టీకల్చర్ హబ్ లో మార్కాపురం కూడా భాగం చేశాం. వెలిగొండ ఫేజ్ 2 ను కూడా 2028కి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతీ ప్రాంత అభివృద్ధి ఎన్డీఏ విధానం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి చేస్తాం 2047 నాటికి పౌరులుగా మనం అంతా ఏం చేయాలో సంకల్పం చేయాలని కోరుతున్నాను

ఓట్ల కోసం కాదు… మార్ను కోసం

నేను ఓట్లు ఆశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తున్నాను. ఇదే కూటమి సిద్ధాంతం ఎన్నికల కోసం కాదు ప్రజల జీవితాలను మార్చేందుకు.. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నాను . ఈ ప్రాంత వాసుల ఆనందం చూస్తుంటే భగవంతుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను . తరాలుగా నష్టపోయిన ఈ ప్రాంతాన్ని ఆదుకునే అవకాశాన్ని ఇచ్చిన భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నా నాడు వేసిన పునాది రాయి…నేడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది కొండలు అడ్డం వచ్చాయి తొలచి ముందుకెళ్లాం..సమస్యలు ఎదరయ్యాయి…పరిష్కరించాం..సవాళ్లు అధిగమించాం, అని సీఎం స్ప‌ష్టం చేశారు.

క‌రువునేల‌లో కృష్ఱ‌మ్మ చిందులే

కరువు నేలకు కృష్ణమ్మను తెచ్చాం…ఇదీ మా కమిట్మెంట్శ్రీ శైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మ.. చెన్నకేశవుడు కొలువైన మార్కాపురం నేలకు హారతి ఇస్తుంది . వెలిగొండ అంటే కరవుపైనే గెలవాలనే సంకల్పం. వెలిగొండ అంటే 3 దశాబ్దాల పోరాటం. వెలిగొండ అంటే రైతు భవిష్యత్తుకు నమ్మకం. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టాలకు ముగిసిన‌ట్టే. కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర. నేడు వెలిగొండతో జల సిరులు… అభివృద్ధికి రెక్కలు వెలిగొండ… నిజంగానే బంగారు కొండ అవుతుంది…మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ ముందు సగర్వంగా చెప్తున్నాను. మాట ఇచ్చాను..నిలబెట్టుకున్నా…పునాది వేశాను…ప్రాజెక్టు పూర్తి చేశాను. కృష్ణమ్మను తెచ్చాం..కరువును తరిమి కొడుతున్నాం. 1996 మార్చి 5న ఏపీ సీఎంగా ఈ ప్రాజెక్టు భూమి పూజ చేశాను. చంద్రబాబు అనే నేను 2026 ఆగస్టు 31న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాను అని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

రాయ‌ల‌సీమ‌కు తిరుగులేదు

శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నాం. 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుంది. రూ.10,200 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో. రూ.7,983 కోట్లు ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తి చేశాం. 18.8 కిలో మీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశాం. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు అక్షరాలా రూ.768 కోట్ల పరిహారం అందించాం. ప్రాజెక్టుతో లబ్ది పొందే వాళ్లు ఎంత సంతోషంగా ఉంటారో, నిర్వాసితులు కూడా అంతే సంతోషంగా ఉండాలి అనేది నా ఆకాంక్ష.ఆర్థికంగా కష్టాలు ఉన్నా మీ బాధలు, మీ అవసరాలు గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నాం. కటాఫ్ డేట్ పెంచి 18 ఏళ్లు నిండిన యువత ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఇస్తున్నాం. కృష్ణమ్మ రాకతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ అనే పదం గత చరిత్రగా మిగిలిపోతుంది. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తెస్తాం. దీని ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 4 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సుస్థిరం అవుతుంది.

పూల సుబ్బ‌య్య త‌న‌య‌ల ఉద్వేగం

పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందలను సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు స‌న్మానం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య. తన తండ్రి పూల సుబ్బయ్యను, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు మరిచిపోలేరని పూల సుబ్బయ్య కుమార్తె విలాసిని అన్నారు. సీఎం చంద్రబాబు కాళ్లకు పూల సుబ్బయ్య కుమార్తెలు న‌మ‌స్క‌రించారు, .

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని… చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని పూల సుబ్బయ్య కుమార్తె ఉద్వేగంగా అన్నారు. తమ కుటుంబం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూలసుబ్బయ్య కుమార్తెలు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం జిల్లా తరహాలోనే ప్రతి జిల్లానూ సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని పూల సుబ్బయ్య రెండో కుమార్తె విలాసిని అన్నారు.