30 CPI members | సీపీఐలో చేరిక…

30 CPI members | సీపీఐలో చేరిక…
30 CPI members | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని వెల్మకన్నె గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ కంపే దుర్గయ్య ఈరోజు సీపీఐ పార్టీలో చేరారు. జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పార్టీ కండువా కప్పి సాదరంగా సీపీఐ పార్టీలోకి ఆహ్వానించారు.
వీరితో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి 30మంది సీపీఐ(30 CPI members) పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గురిజా రామచంద్రం, తీర్పారి వెంకటేశ్వర్లు, మండల సీపీఐ కార్యదర్శి భీమనపల్లి రమేష్, మండల సహాయ కార్యదర్శి రాపోలు సత్తయ్య, కారింగు శ్రీను, కట్ట ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
