2nd movie | మెగా పవర్ స్టార్ రాం చరణ్

2nd movie | మెగా పవర్ స్టార్ రాం చరణ్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నిర్మలా కాన్వెంట్ సినిమాతో పరిచయం అయి, క్యూట్ లవర్ బాయ్ గా ప్రేక్షకులను మెప్పించి, ఆ తర్వాత శిష్యురాలి దర్శకత్వంలో, స్వయంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు నటించిన పెళ్ళిసందడి సినిమాలో సాక్షాత్తొ దర్శకేంద్రుడి పాత్రలో జాలీ జాలీగా కనిపించాడు శ్రీకాంత్ తనయుడు రోషన్.
ఆ సినిమా పర్వాలేదనిపించేలా ఆడినా, ఆ తర్వాత మాత్రం రోషన్ మళ్ళీ సినిమా చేయలేదు. చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు అనస్వర రాజన్ తో కలిసి జంటగా నటించిన చిత్రం ఛాంపియన్.

ఈ సినిమాకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 1948 నాటి కథతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు ఈ సినిమాని. అప్పటి వస్త్రధారణ, ఆహార్యం, కథా నేపథ్యంతో ట్రెయిలర్ ఆసక్తిరేపుతోంది.

‘ఛాంపియన్’ టైటిల్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం హించిన చాంపియన్ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ అందించిన గిరా గిరా పాట చార్ట్ బస్టర్ అయ్యింది.
ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మెగా అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. సినిమా పట్ల క్రేజ్ ను పెంచి, ఎప్పుడెప్పుడాని ఎదురు చూసేలా చేస్తోంది.

2nd movie వైజయంతి పేరు ఉంటే చాలు..

2nd movie
2nd movie


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్, అల్లు అర్జున్ కి మొదటి సినిమా గంగోత్రి, మహేష్ గారికి రాజకుమారుడు, నాకు చిరుత.. మా అందరికీ మోస్ట్ కామన్ బ్యూటిఫుల్ పర్సన్ మా అశ్వినీదత్తు గారికి, వైజయంతి మూవీస్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము ఎలా పెర్ఫాం చేస్తామో తెలియకుండానే మా అందరికీ మొదటి సినిమా ఇచ్చి ఇంత అద్భుతమైన ప్రయాణాన్ని ఇచ్చినందుకు దత్తు గారికి థాంక్యూ సో మచ్. రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్ తో వస్తున్నాడు. తనకి వైజయంతి మూవీస్ లో అద్భుతమైన సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. వైజయంతి పేరు ఉంటే చాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు వస్తాయి. రోషన్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఇందులో తన పోస్టర్ చూస్తుంటే.. ఒక హాలీవుడ్ యూరోపియన్ యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. చాలా మంచి మనసున్న మా అన్నయ్య శ్రీకాంత్, ఊహగారు. రోషన్ కి వాళ్ళ అందమే వచ్చింది. అని అన్నారు.

2nd movie | …నాకు అవకాశం ఇస్తే..

2nd movie
2nd movie


నా రెండో సినిమా మగధీర ఎంత పెద్ద హిట్ అయిందో.. ఛాంపియన్ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పెర్ఫార్మ్ చేయాలంటే.. చాలా మెచ్యూరిటీ కావాలి. ఈ సినిమా కోసం రెండేళ్లు అలాంటి ప్రీ ప్రొడక్షన్ జరిగింది. మేము కూడా కొన్ని సినిమాలుకి మూడు నాలుగు సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఉన్నాం. సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందనేది ముఖ్యం. అశ్వినీ దత్ గారు ఎంత పాషన్ గా ఉంటారో స్వప్న ప్రియాంక కూడా అంతే పాషన్ తో వర్క్ చేస్తారు. అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికినప్పుడు ప్రతి యాక్టర్, డైరెక్టర్ చాలా లక్కీ. వాళ్ళు చాలా మంచి డైరెక్టర్స్ ని యాక్టర్స్ ని పరిచయం చేశారు. అలాగే నాగ్ అశ్విన్ గారితో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. స్వప్న ప్రియాంక మళ్లీ నాకు అవకాశం ఇస్తే.. వాళ్ళ బ్యానర్లో చేయాలని అనుకుంటున్నాను.

2nd movie | ఇది ఒక క్లాసిక్..

నా స్వార్థం ఏంటంటే.. ఇంత పాషన్ ఉన్న మనుషులతో పని చేస్తే.. మనం హాయిగా షూటింగ్ కి వెళ్లి రావచ్చు. ప్రదీప్ గారు తన షార్ట్ ఫిలింతో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఇందులో చూపించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కంటెంట్ చూస్తుంటే.. ఒక క్లాసిక్ లాగా అనిపిస్తుంది. ఒక లగాన్ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. రోషన్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ప్రదీప్ గారు తన యాక్టర్స్ ని చాలా చక్కగా మౌల్డ్ చేశారు. ఈ సినిమా కోసం టీమ్ అందరూ పెట్టిన హార్డ్ వర్క్ డిసెంబర్ 25న రిజల్ట్ ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. తోట గారు, పీటర్ మాస్టర్, మిక్కీ జే మేయర్ ఇలాంటి లెజెండ్స్ ఈ సినిమాకి పని చేశారు. చాలా రేర్ గా ఇలాంటి కాంబినేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నాను ఛాంపియన్ విన్నర్ అవుతుంది.

2nd movie | ..ఆశగా ఉంది..

2nd movie
2nd movie

అనస్వర ఫేస్ చాలా కళగా ఉంది. తన పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. తనకి తప్పకుండా చాలా మంచి అవకాశాలు వస్తాయి. తన మాతృభాష మలయాళం కానీ మన తెలుగు భాష నేర్చుకుని ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పింది. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అలా చెప్పలేదు. మా నాన్నగారితో మున్నాభాయ్ ఎంబిబిఎస్ మున్నాభాయ్ జిందాబాద్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ జెమినీ కిరణ్ గారు కూడా ఈ సినిమాకి సహా నిర్మాతలుగా ఉన్నారు. వారికి ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 25న ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది. మీరందరూ కూడా చూసి టీమ్ హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.. అన్నారు.

click here to read Aditya 999 బాలయ్యతో గీతా ఆర్ట్స్ మూవీ..?

click here for more

Leave a Reply