21st and 22nd | ఆపరేషనల్ కారణాలతో…

21st and 22nd | ఆపరేషనల్ కారణాలతో…
- ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
21st and 22nd | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఆపరేషనల్ కారణాల నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటనలో తెలిపారు. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుల్లూరుపేట–నెల్లూరు, నెల్లూరు–సుల్లూరుపేట మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 22 తేదీల్లో రద్దు కానున్నాయి. నిర్వహణ సంబంధిత అవసరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…
రైలు నం. 66041 – సుల్లూరుపేట నుంచి నెల్లూరు (శనివారం, 21 ఫిబ్రవరి 2026)
రైలు నం. 66037 – సుల్లూరుపేట నుంచి నెల్లూరు (శనివారం, 21 ఫిబ్రవరి 2026)
రైలు నం. 66038 – నెల్లూరు నుంచి సుల్లూరుపేట (శనివారం, 21 ఫిబ్రవరి 2026)
రైలు నం. 66040 – నెల్లూరు నుంచి సుల్లూరుపేట (శనివారం, 21 ఫిబ్రవరి 2026)
రైలు నం. 66035 – సుల్లూరుపేట నుంచి నెల్లూరు (ఆదివారం, 22 ఫిబ్రవరి 2026)
ఈ రైళ్లపై ఆధారపడిన ప్రయాణికులు ముందుగా ప్రత్యామ్నాయ రైళ్లు లేదా ఇతర ప్రయాణ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు సంబంధిత రిఫండ్, మార్పుల వివరాల కోసం రైల్వే వెబ్‌సైట్ లేదా సమీప రైల్వే స్టేషన్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

