21 నామినేషన్లు స్వీకరణ

ముత్తుకూరు, ఆంధ్రప్రభ: ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి బుధవారం 21 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు అన్నారు. బుధవారం రాత్రి ఎంపిటిసి ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15, తెలుగుదేశం పార్టీ 2, ఇండిపెండెంట్ నాలుగు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 21 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సమగ్రంగా పరిశీలించామని ఆయన పేర్కొన్నారు.