20th Ward | మౌనం వీడిన ‘బొర్రా’ కుటుంబం.. వైరా మున్సిపల్ ఎన్నికలో ఉమాదేవి ఎంట్రీ!

20th Ward | వైరా మున్సిపల్ ఎన్నికలో బొర్రా ఉమాదేవి దరఖాస్తు
చైర్మన్ రేసులోకి బొర్రా కుటుంబం ఎంట్రీ?
కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల పోటీ.. పెరుగుతున్న రాజకీయ వేడి
బొర్రా కుటుంబ నిర్ణయంతో ఉత్కంఠగా మారిన వైరా ఎన్నిక
20th Ward | వైరా జనవరి 27 ఆంధ్రప్రభ : వైరా మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.. నిన్నటి వరకు మౌనం వహించిన బొర్రా కుటుంబం.. ప్రస్తుతం మౌనం వీడారు.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ కుటుంబం పోటీ చేస్తుందా..? లేదా..? అనే విషయంలో తీవ్ర స్థాయి చర్చలు జరిగాయి..
నాటి బొర్రా భద్రయ్య బొర్రా వెంకటేశ్వర్లు నుండి.. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నిక వరకు బొర్రా కుటుంబం ప్రధాన భూమిక పోషించింది.. ఎన్నిక మున్సిపల్ ఎన్నిక షెడ్యూల్ నామినేషన్ ప్రక్రియ మొదలవుతుండటంతో ఎన్నికల వేడి హఠాత్తుగా వేడేక్కింది… కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైరా మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు 20 వార్డులోని ఆశావాహులను ఆహ్వానిస్తూ దరఖాస్తులను ఇవ్వాలంటూ ఆదివారం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు ఈ నేపథ్యంలో.. ఆశావాహులందరూ కూడా దరఖాస్తులను సమర్పించారు..

ఈ ఎన్నికల్లో బొర్రా కుటుంబం కు సంబంధించి రాష్ట్ర మార్క్ పేడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సతీమణి మాజీ జడ్పిటిసి బొర్రా ఉమాదేవి దరఖాస్తును సమర్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. బర్ర ఉమాదేవి 2014 నుంచి 2019 వరకు వైరా జెడ్పీటీసీగా మున్సిపాలిటీ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో చైర్మన్ బరిలో పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. బొర్రా కుటుంబం స్తబ్దతగా ఉండటం అంతుచిక్కని ప్రశ్నగా మారింది..

ఆ కుటుంబం ప్రస్తుతం క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తున్న బొర్రా రాజశేఖర్ ఎన్నికలకు సంబంధించి వేసే అడుగుల వైపు ప్రజలు తీక్షణంగా ఎదురుచూస్తున్నారు.. ఉమాదేవి ఆశావాహురాలుగా దరఖాస్తు కాంగ్రెస్ పార్టీకి సమర్పించడంతో.. తాము కూడా బరిలో ఉన్నారనే సంకేతాన్ని చెప్పకుండానే తెలియజేసినట్లు అయింది.. ఈ వార్తతో బొర్రా అనుచరుల్లో అభిమానుల్లో ఉత్సాహంలో మునిగితేలుతున్నారు.. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో . వైరా మున్సిపాలిటీ ఎన్నిక ఉత్కంఠకు తెరలేపింది….
