కౌకుంట్లలో బూత్ కన్వీనర్ల సమావేశం

కౌకుంట్లలో బూత్ కన్వీనర్ల సమావేశం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలోని 5 వ క్లస్టర్ పరిధిలోని, బూత్ కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు మాట్లాడుతూ.. 2024 ఎన్నికలలో బూత్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా పనిచేసి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు భారీ మెజార్టీని తీసుకొచ్చినందుకు గాను, క్లస్టర్ ఇంచార్జ్ లకు, బూత్ ఇంచార్జ్ లకు, గ్రామ టిడిపి నాయకులకు అభినందించారు.

అలాగే పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన, బాగా కష్టపడి, మంచి పేరు తీసుకొని రావాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా అందరూ ఎదగాలని ప్రోత్సహించారు. మీకు ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తానన్నారు. క్లస్టర్ ఇంచార్జ్ లు , బూత్ ఇంచార్జ్ లు, గ్రామ టిడిపి నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నరిశెట్టి విజయ భాస్కర్, 5 వ క్లస్టర్ ఇంచార్జ్ నెట్టెం రాంబాబు, మండల టిడిపి కన్వీనర్ మోపిడి గోవిందు, యువ నాయకులు దేవినేని రణధీర్, దేవినేని భాస్కర్, బూత్ ఇంచార్జ్ లు, మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply