Thursday, January 16, 2025

సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్

ఎట్టకేలకు టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 117 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో రిషబ్ పంత్ సెంచరీ మార్కు అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో పంత్‌కు ఇది మూడో సెంచరీ. ఇటీవల ఆసీస్ పర్యటన నుంచి పలు మార్లు 90ల్లో అవుటైన అతడు దూకుడుగా ఆడి సెంచరీ సాధించడంతో భారత అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. పంత్, సుందర్ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సెంచరీ (113) భాగస్వామ్యం అందించి భారత్‌ను సురక్షిత స్థితికి చేర్చారు. వీరి కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరును దాటి 50 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా సెంచరీ చేసిన పంత్ (101) అనంతరం అండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement