Monday, January 20, 2025

యశ్ దగ్గర కార్ల కలెక్షన్

కన్నడ స్టార్ హీరో యశ్ దగ్గర అరడజన్ కి పైగా కార్లు ఉన్నాయట. ఆయన దగ్గర ఉన్న కార్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. యశ్ దగ్గర టాప్ మోడల్స్ కార్లు చాలానే ఉన్నాయి. కార్ల విషయంలో యష్ చాలా ఆసక్తిగా ఉంటారట. మార్కెట్ లోకి కొత్త కారు వస్తే చాలు యష్ వాకిట్లో ఉండితీరాల్సిందేనట. అందుకే ఆయన దగ్గర ప్రస్తుతం ఆరు కార్లకి పైగానే ఉన్నాయి. ఆ కార్లలో  ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో యశ్ ముందున్నాడు. ఛాప్టర్ 2 కోసం 40 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు ఈయన. ఇదిలా ఉంటే యూ ట్యూబ్‌లో ఆ మధ్య విడుదలైన ‘కెజియఫ్‌ 2’ టీజర్‌ సంచలనం రేపింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌ వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. జులై 16, 2021న కెజియఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement