Tuesday, January 7, 2025

మామయ్య అర్జున్ స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చా

కన్నడ హీరో ధృవసర్జా హీరోగా..హీరోయిన్ గా రష్మిక మందన నటించిన చిత్రం పొగరు. ఈ చిత్రం  సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు బై ఏ సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 19న తెలుగు, తమిళం, కన్నడలో ఏకకాలంలో భారీగా విడుదలకాబోతోంది. ఈ చిత్రాన్ని సాయి సూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి. ప్రతాప్‌ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమం  చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ అతిథిగా పాల్గొని తన మేనల్లుడైన హీరో ధృవ సర్జాను పరిచయం చేశారు.   ”మామయ్య యాక్షన్ కింగ్ అర్జున్‌ స్పూర్తితోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చా. ఆయనలా తప్పకుండా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ‘పొగరు’లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో చేశాను. నా పాత్ర కోసం చాలా శ్రమించాను. కమర్షియల్ అంశాలన్నీ నిండుగా ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. సినిమాలో పాటలు, ఫైట్లు, డైలాగ్స్‌.. వేటికవే హైలెట్‌గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. అంతర్జాతీయ బాడీ బిల్డర్లు నలుగురు నటించి ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చారు. రష్మిక నటన యువతను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను..” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement