Saturday, January 18, 2025

ఆ పాత్ర కోసమే కిక్ బాక్సింగ్..

హీరోయిన్ రాశీఖన్నా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటోందట. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోందీ బ్యూటీ. బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కాగా కిక్ బాక్సింగ్ చేస్తోన్న తన ఫొటోని రాశి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఆ ఫొటో గురించి ఆమె తాజాగా మాట్లాడింది. `చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కు వెళుతుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. షాహిద్ వంటి హీరోతో కలిసి నటించడం ఆనందం కలిగిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసమే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. అంతకు మించి ఆ పాత్ర గురించి నేనేం చెప్పలేను. కిక్ బాక్సింగ్, వర్కవుట్ల వల్ల మనం మరింత ఫిట్‌గా మారవచ్చు. బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి అది కూడా ఒక కారణమని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement