ధరణికోటలో రైతన్న మీకోసం ర్యాలీ…

ధరణికోటలో రైతన్న మీకోసం ర్యాలీ…
అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతిమండలంధరణికోటగ్రామంలోసోమవారం రైతన్నా – మీకోసం కార్యక్రమంసందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ర్యాలీనిప్రారంభించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రైతులతో మమేకమై రైతులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనువివరించారు.అన్నదాత సుఖీభవ పథకం కింద మండలంలో 10,259 మంది రైతుల ఖాతాల్లో 20.4 కోట్లు జమ అయిందనివివరించారు.
వ్యవసాయం అంటే దండగా కాదు పండగ అని నిరూపించేలా రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు. రానున్న రోజుల్లో మరింతగా వ్యవసాయాన్ని లాభ సాటిగా చేసే విధంగా కొత్త పథకాలను కూటమి ప్రభుత్వం రూపొందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు షేక్ జానీ, మండల పార్టీ అధ్యక్షులు మంచినేని రాజా, నాయకులు మల్లాది విష్ణు, దండా నాగేంద్ర, కామిరెడ్డి నవీన్, వసంతరావు, బవిరిశెట్టివెంకటేశ్వరావు, నల్లిబోయిన రాజశేఖర్ యాదవ్, అలా వీరబాబు, గుడిసె కిరణ్ కుమార్, జింక నాగలక్ష్మి, షేక్ బాబు, మండల వ్యవసాయ అధికారి షేక్ అహ్మదు తదితరులుపాల్గొన్నారు.
