కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి… అభివృద్ధి నా బాధ్యత

గెలుపు దిశగా ..దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న
- 1 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి పల్లెర్ల వెంకన్న
మోత్కూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి… అభివృద్ధి నా బాధ్యత అంటూ మోత్కూర్ మున్సిపాలిటీ లోని 1 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న గెలుపు దిశగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. 1 వ వార్డులో ఓటర్లతో,పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.అభ్యర్థి వెంకన్నకు వార్డు ప్రజలు,ఓటర్లు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు,రైతులు, ఉద్యోగులు సబ్బండ వర్గాలు బ్రహ్మరథం పడుతున్నారు . ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని, అహర్నిశలు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు . - 1 వ వార్డులో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, చెత్తకుండీల ఏర్పాటు , త్రాగునీటి శాశ్వత పరిష్కారం, పేదలకు రేషన్ కార్డులు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు , ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అర్హులకు అందేలా చూస్తానని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో వార్డు అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయించి 1 వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి…
- ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పురుగుల వెంకన్న,మాజీ కో ఆప్షన్ సభ్యురాలు పొలినేని ఆనందమ్మ స్వామి రాయుడు,నాయకులు బోయిని యాకయ్య,మహ్మద్ అలీ,జంగ వెంకట్ నర్సు,సుధగాని పాండు,కొనతం సత్తయ్య,మసురం వెంకన్న, ఇక్కిరి నాగరాజు,జహంగీర్,రవి,జినుకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
