తెలంగాణలో 17 మంది డీఎస్పీల బదిలీ..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు, పోస్టింగ్స్ తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డీఎస్పీగా వెయిటింగ్‌లో ఉన్న కె.బాలకృష్ణారెడ్డిని మల్కాజిగిరి సైబర్ క్రైమ్స్ ఏసీపీగా నియమించారు. అక్కడి ఏసీపీ ఎస్.జి. శివశంకర్‌ను బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఎస్.కె.అబ్దుల్ రహమాన్‌ను జయశంకర్ భూపాలపల్లి డీసీఆర్‌బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా, ఏ.రవి కుమార్‌ను జగిత్యాల డీసీఆర్‌బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా నియమించారు. బి. నందిరామ్ నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కంట్రోల్ రూమ్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.
బి.సోమ్నారాయణ్ సింగ్‌ను టీజీపీఏలో డీఎస్పీగా, జె.వెంకటేశ్వర్‌రావును మెదక్ డీసీఆర్‌బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా నియమించారు. బి. కిషన్ కుమార్‌కు హైదరాబాద్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా, ఎల్. రమేశ్ కుమార్‌కు హైదరాబాద్ సీటీసీ ఏసీపీగా బాధ్యతలు అప్పగించారు.
ఎన్.శ్రీనివాస్‌రెడ్డిని సంగారెడ్డి డీసీఆర్‌బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా, కదరు వెంకట్‌రెడ్డిని టీజీపీఏ డీఎస్పీగా నియమించారు. కొమట్ల సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా, ఎస్. సుదర్శన్‌కు హైదరాబాద్ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.
ఎన్.శంకర్‌ను హైదరాబాద్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా, పి. విజయ్‌కుమార్‌ను వెస్ట్‌జోన్ రోడ్ సేఫ్టీ డీఎస్పీగా నియమించారు. రాజన్న సిరిసిల్ల డీసీఆర్‌బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా ఉన్న కె. భాస్కర్‌ను బదిలీ చేసి టీజీపీఏ డీఎస్పీగా నియమించారు.
ఆదిలాబాద్ డీసీఆర్‌బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా ఉన్న ఎం. వెంకట నర్సయ్యను బదిలీ చేసి సీఐడీ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.
బదిలీ అయిన అధికారులను సంబంధిత యూనిట్ అధికారులు వెంటనే రిలీవ్ చేసి, కొత్త పోస్టింగ్‌లలో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది.


