16 villages | శివనామస్మరణతో హోరేత్తిన ఆలయాలు

16 villages | శివనామస్మరణతో హోరేత్తిన ఆలయాలు

16 villages | రాప్తాడు, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి ఉత్సవాలను మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఉన్న శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన రాప్తాడులో వెలసిన శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు మండలం వ్యాప్తంగా ఉన్న రామేశ్వర స్వామి ఆలయం అయ్యవారపల్లి గంగలకుంట పుల్లలరేవు ఎర్రగుంట బండమీదపల్లి గాండ్లపర్తి బుక్కచెర్ల జి. కొత్తపల్లి ప్రసన్నాయపల్లి పంచాయతీలోని చిన్మయనగర్ లో వెలసిన గౌరీ ప్రసనేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు విరివిరిగా నిర్వహించారు.

అదేవిధంగా హంపాపురం సమీపంలోని మౌనగిరి క్షేత్రంలో వెలసిన 39 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయం మరూరులో చిన్న కదిరయ్య స్వామి ఆలయం అయ్యవారిపల్లి గ్రామంలో ఎర్రితాత ఆలయంలో అభిషేకం అన్నాభిషేకం అంకురార్పణ కలశ ప్రతిష్ట గణపతి హోమం లక్ష బిల్వర్చన ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి అన్నదానం తర్వాత మృత్యుంజయ యజ్ఞం రుద్ర హోమం లలిత సహస్రనామ పటనం పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించామని ఆయా గ్రామాల పెద్దలు పూజారులు తెలిపారు.

శివభక్తులు శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా మేలుకున్నారు. ఆలయాల నిర్వాహకులు స్థానికులు కలసి ఆలయాల వద్ద నాటిక ప్రదర్శనలు పురాణ వేదాలను పలకరించడం చేశారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply