13th Ward | ఒక్క అవకాశం ఇవ్వండి.. మీకు తోడుగా ఉంటా..

13th Ward | ఒక్క అవకాశం ఇవ్వండి.. మీకు తోడుగా ఉంటా..

  • 13వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో తాటికొండ వినయ్ కుమార్

13th Ward | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థిగా తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) బరిలోకి దిగారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులు, సహకారంతో ప్రజల ముందు కు వస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం వినయ్ కుమార్ మాట్లాడుతూ.. వార్డులో గత కొన్నేళ్లుగా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పొన్న సత్తయ్య ఇంటి పక్కన ఉన్న మురికి కాలువ సమస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అదే విధంగా రోడ్డు పక్కన డ్రైనేజీల సమస్యలు, పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, మరమ్మత్తుల పనులను త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు. ఇంటి కి ఇంటికి సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా, నిజమైన అర్హులకు మాత్రమే అందేలా చూస్తానని స్పష్టం చేశారు. యువతను తప్పుదారి పట్టకుండా, విద్యా, క్రీడా రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రోత్స హిస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య సహకారం తో వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అనంతరం నన్ను గెలిపించే బాధ్యత మీది…అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఈ సందర్బంగా కోరారు. రాజకీయాలకు అతీతంగా, వార్డులోని ప్రతి ఒక్క రిని దేవుళ్లుగా భావించి సమానత్వంతో పనిచేస్తానని తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) తెలిపారు.

Leave a Reply