11thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా.

11thFebCartoon | తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు: ప్రచారం బంద్, ఓటరే అంతిమ నిర్ణేత
11thFebCartoon | మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి తెర
హోరాహోరీ ప్రచారం తర్వాత గప్చుప్ వాతావరణం
ఆరోపణలు, హామీల మధ్య ఓటరు అనిశ్చితి
అభ్యర్థుల్లో లోపల భయం, బయట ధీమా
ఓటరును ప్రసన్నం చేసుకోవడమే చివరి ప్రయత్నం
ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించిన కార్టూన్
‘ఔరా’ కార్టూన్ ఫీచర్ ప్రత్యేకత

ఓటరును ప్రసన్నం చేసుకోవడమే ఫైనల్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : స్థానిక పురపోరులో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థుల నోళ్లకు మొన్ననే తెరపడింది. ఒకరిమీద ఇంకొకరు… ఒక పార్టీమీద ఇంకో పార్టీ… తీవ్ర ఆరోపణలు, కర్ణకఠోరమైన తిట్లు , దుమ్మెత్తి పోసుకోవడాలు… ఎన్నికలంటే హోరు మామూలేనన్నట్టు మైకాసురుల శబ్దాలతో ఊరూ–వాడా తిరిగీ తిరిగీ మరీ హామీలు గుప్పించారు.
ఓటర్లపై వాగ్దానాల వరద (Power), ప్రత్యర్థులపై వాగ్బాణాల వర్షం ఆగలేదు. కానీ ఇన్ని చేసినా, ఇంత చేసినా, ఓటరు మనసులో ఏముందో చెప్పడం ఎవరి తరమూ కాదు. ఎవరిని అందలమెక్కిస్తారో, ఎవరిని అథఃపాతాళానికి తొక్కేస్తారో అన్న అనిశ్చితి అభ్యర్థులను లోపలలోపల కలవరపెడుతోంది.
అభ్యర్థుల్లో, పార్టీల నాయకుల్లో పైకి కనిపించే ధీమా అంతా మేకపోతు గాంభీర్యమే లోపల మాత్రం భయం, గుబులు . గెలిస్తే తమంత గొప్పోళ్లు లేరన్న అహం ఓడితే పరిస్థితి ఏమిటి? పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా? ప్రజల్లో, ప్రత్యర్థుల్లో తలెత్తుకుని తిరిగేదెలా? అన్న ప్రశ్నలు మనసును వేదించే ఒత్తిడిగా మారుతున్నాయి.
ఆర్భాటంగా నిర్వహించిన ప్రచారాల్లో ఎన్ని బీరాలు పలికినా, రహస్యంగా పంపకాలు పూర్తి చేసినా, చివరకు మిగిలింది ఒక్కటే ఓటరును ఫైనల్గా ప్రసన్నం చేసుకోవడమే అప్పుడే తమ తలరాతలు మారతాయన్న ఆశ ఇప్పుడు ఓటరు దేవుడి ముందు మోఖరిల్లడం, తమ బాధను వ్యక్తం చేయడమే చివరి మార్గంగా కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని శక్తివంతమైన సందేశంతో చమత్కారంగా ఆవిష్కరించినది ఆంధ్రప్రభ కార్టూన్. రాజకీయాల్లోని నెగటివ్ మాటల కలకలం ఓటరు చేతిలో ఉన్న అంతిమ శక్తిని ఈ కార్టూన్ స్పష్టంగా చూపిస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను ఆకట్టుకుంటూ కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ‘ఔరా’
