1116 Maha | శివనామ స్మరణలతో మారుమోగుతున్న శివాలయాలు

1116 Maha | శివనామ స్మరణలతో మారుమోగుతున్న శివాలయాలు
1116 Maha | ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లాలోని శివాలయాలు అన్ని శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. వేకువజాము నుండి భక్తులు బారులు తీరి ముక్కంటిని దర్శించుకున్నారు. జిల్లా నుండి శ్రీశైలం, కోటప్పకొండ తో పాటు ఇతర క్షేత్రాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. కాగాకొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో 1116 మహా శివలింగాల శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు పార్లమెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిశీలుకులు సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందంరెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, పార్టీ రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులు, టంగుటూరు మండల పరిశీలుకులు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, కొండపి నియోజకవర్గ పరిశీలకులు YV వెంకటేశ్వర్లు, రాష్ట్ర యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ రావూరి ప్రవీణ్, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, జిల్లా యువజన విభాగ సెక్రటరీ మేదరమెట్ల భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


