AP | 11 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం!
AP | 11 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం!
పలు శాఖల్లో పోస్టింగులు..
అదనపు బాధ్యతల కేటాయింపు
AP | అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి పోస్టింగులు, పూర్తి అదనపు బాధ్యతల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) 2026 అక్టోబర్ 12న జీవో ఆర్టీ నంబర్ 1985ను విడుదల చేసింది. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురు అధికారులకు వివిధ శాఖల్లో బాధ్యతలు అప్పగించగా, మరికొందరికి అదనపు బాధ్యతలు కేటాయించింది.
వివిధ శాఖల్లో పోస్టింగులు
సౌరభ్ గౌర్ (2002 బ్యాచ్): న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమితులయ్యారు.
డి. మురళీధర్ రెడ్డి (2006 బ్యాచ్): గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ బాధ్యతల నుంచి ఎం.ఎం. నాయక్‌ను తప్పించారు.
మంజులే బాలాజీ డిగంబర్ (2009 బ్యాచ్): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
అమ్రపాలి కాటా (2010 బ్యాచ్): యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖలో (YAT&C) ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమె శంషేర్ సింగ్ రావత్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించనున్నారు.
కె. నీలకంఠ రెడ్డి (2017 బ్యాచ్): యువజన సేవల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ బాధ్యతల నుంచి ఎస్. భరణిని తప్పించారు.
బి. అనిల్ కుమార్ రెడ్డి (2017 బ్యాచ్): పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
ఎన్. తేజ్ భరత్ (2018 బ్యాచ్): సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) కార్యదర్శిగా నియమించేందుకు ఆయన సేవలను ఆ శాఖకు అప్పగించారు.
గెడెల శ్రీను కుమార్: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.
ఎం. వరప్రసాద్: ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించేందుకు ఆయన సేవలను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. ఈ బాధ్యతల నుంచి కె. కన్నబాబును తప్పించారు.
డాక్టర్ కె. శ్రీనివాసులు (2014 బ్యాచ్): ప్రస్తుతం ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల నుంచి పట్టణశెట్టి రవిసుభాష్ను తప్పించారు.
శుభం బన్సాల్ (2020 బ్యాచ్): పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల నుంచి డాక్టర్ ఎన్. యువరాజ్‌ను తప్పించారు.
ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
