పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
పరీక్షలకు హాజరుకానున్న 558 విద్యార్థులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఈనెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఊట్కూర్ ఎంఈఓ మాధవి తెలిపారు. శుక్రవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి, ఊట్కూర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లుతెలిపారు. ఊట్కూర్ మండలంలో 558 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 339 మంది బాలికలు, 219 మంది బాలురు పరీక్షలకు హాజరుకానున్నారు.
పదవతరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఊట్కూర్ బాలుర ఉన్నత పాఠశాలలో 128 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా చీఫ్ సూపర్డెంట్ గా సుధీర్, డిపార్ట్మెంటల్ అధికారిగా మహేష్, ఊట్కూర్ బాలికల ఉన్నత పాఠశాలలో 125 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా చీప్ సూపర్డెంట్ గా కిషోర్ కుమార్, డిపార్ట్మెంటల్ అధికారిగా మహేష్, పులిమామిడి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 148 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా చీఫ్ సూపర్డెంట్ గా నర్సిములు డిపార్ట్మెంటల్ అధికారిగా భాస్కర్, పులిమామిడి జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 137మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా చీఫ్ సూపర్డెంట్ గా సత్యనారాయణ, డిపార్ట్మెంటల్ అధికారిగా అశోక్ విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది కేజీబీవీ బాలికలు 52 మంది పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వివరించారు.పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయాన్ని కంటే ముందు హాజరుకావాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
