100 percent | సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వివరించండి

100 percent | సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వివరించండి
- యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీకి మూలస్తంబాలు.
- యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి.
100 percent | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నారాయణపేట యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ సూర్య ప్రకాశ్ రెడ్డి ఇంట్లో మండల యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమీక్ష సమావేశం(Review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువజన కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు యువజన సంఘం సభ్యులు పార్టీ ప్రతిష్టకు మూల స్తంభాలనిఅన్నారు.
జిల్లా కమిటీ ఆదేశాల మేరకు గ్రామాల్లో యువజన కాంగ్రెస్ కమిటీలు సకాలంలో పూర్తి చేయడం అభినందనీయమనిఅన్నారు. నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో యువజన సంఘం నాయకులను ప్రోత్సహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచితబస్సు సౌకర్యం, నూతన రేషన్ కార్డులు(ration cards) రైతుల రుణమాఫీ తదితర పథకాలు పెట్టిందన్నారు. నూతన కమిటీ సభ్యులు గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుందామని రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో 100 శాతం(100 percent) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందే విధంగా ముందు నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం జిల్లా, మండల, గ్రామ కమిటీల అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు కొక్కు మల్లేష్, సువర్ణ రవికుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
