100 people | ఏఐపై అవగాహన కార్యక్రమం

100 people | ఏఐపై అవగాహన కార్యక్రమం
100 people | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో “ఎఐ అవగాహన & ప్లేస్‌మెంట్ ట్రైనింగ్” వర్క్‌షాప్‌ను మంగళవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.ఉమా రాణి అధ్యక్షతన, వైస్ ప్రిన్సిపాల్ జి. నాగార్జున పర్యవేక్షణలో జరిగింది.
ఈ కార్యక్రమానికి కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ ఎన్.స్వర్ణ జ్యోతి స్వాగత ప్రసంగం చేసి, నేటి సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యతను వివరించారు. ఏఐ విద్య, పరిశ్రమలు, ఆరోగ్య రంగం, కార్పొరేట్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నదని, విద్యార్థులు ఈ నైపుణ్యాలను అలవర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన మిస్టర్ మణికంఠ మణేపల్లి ఏఐ వినియోగం, ఉద్యోగ ఇంటర్వ్యూలకు అవసరమైన ముందస్తు అర్హతలు, నిర్ణయాత్మక, సమస్య పరిష్కార నైపుణ్యాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ డా.డి.ఉమా రాణి తన సందేశంలో విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచానికి సిద్ధమవ్వాలని సూచించారు. సుమారు 100 మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయుక్తంగా, విజ్ఞానవంతంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు.
