కాకినాడ నుంచి 10 రైళ్లు రద్దు

కాకినాడ నుంచి 10 రైళ్లు రద్దు

సామర్లకోట, ఆంధ్రప్రభ : “మొంథా” తుఫాన్(Cyclone “Monthaష‌) ప్రభావం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విజయవాడ విశాఖపట్నం స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లు రద్దు అయినట్లు విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంగళవారం రద్దయిన పది రైళ్లు వివరాలు ఇవి. 12727 విశాఖ- హైదరాబాద్ ఎక్స్ప్రెస్,22203 విశాఖ- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్,20811 విశాఖ- ఎన్ఈడి ఎక్స్ప్రెస్, 12739 విశాఖ – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, 20805 విశాఖ- న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్,17220 విశాఖ -మచిలీపట్నం ఎక్స్ప్రెస్(Visakhapatnam-Machilipatnam Express), 18519 విశాఖ విశాఖ – ఎల్టిటి ఎక్స్ప్రెస్, 17244 రాయగడ- గుంటూరు ఎక్స్ప్రెస్, 11020 బి బి ఎస్ ఎన్- శివాజీ మహారాష్ట్ర టెర్మినల్ ఎక్స్ప్రెస్, 12738 లింగంపల్లి లింగంపల్లి- కాకినాడ రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

58501 విశాఖపట్నం – కొరాపుట్ ప్యాసింజర్, 58502 కొరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్, 17267, 17268 కోట – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, 18584 తిరుపతి – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, 22875, 22676 విశాఖపట్నం – గుంటూరు డబుల్ డెక్కర్ రైళ్లు రద్దు చేశారు. ఇంకా విశాఖపట్టణం – రాజమండ్రి మధ్య నడిచే మేము రైళ్లు కూడా తాత్కాలికంగా రద్దు అయినట్టు అధికారులు చెబుతున్నారు. రైల్వే అధికారులు ప్రజలకు రైలు ప్రయాణానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్(website) లేదా 139 హెల్ప్‌లైన్ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

ప్రయాణికుల భద్రతకు ఇది తాత్కాలిక చర్యగా చేపట్టబడిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఈ మేరకు రైల్వే ఉన్నత అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా సామర్లకోట స్టేషన్ మేనేజర్ యమ్.రమేష్(Y.M.Ramesh) మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ కు వచ్చిన వారందరికీ ఎటువంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply