1 Town Police | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో….

1 Town Police | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో….

1 Town Police | గుడివాడ – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎన్ఆర్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ I టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు చేయబడింది.

ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులు వేగ పరిమితులు పాటించడం, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచనలు ఇవ్వబడినవి. ప్రజలు తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా వాహనాలు నడపాలని గుడివాడ I టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

Leave a Reply