1 Dead Trump Safe : వైట్ హౌస్ లో కాల్పుల కలకలం Andhra rabha Top News

1 Dead Trump Safe : వైట్ హౌస్ లో కాల్పుల కలకలం Andhra rabha Top News
- అమెరికా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
- ఎదురుకాల్పుల్లో దుండగుడు మృతి
- మరో బాటసారికి తీవ్ర గాయాలు
- ట్రంప్ భద్రతపై విమర్శలు
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)

1 Dead Trump Safe : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో
భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు
కాల్పుల ఘటన కలకలం రేపింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనంలో ఉన్న సమయంలో భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఓ సాయుధ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన అమెరికా రహస్య భద్రతా విభాగం అధికారులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. మరో బాటసారి కూడా గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, వైట్ హౌస్ పశ్చిమ వైపు 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ కూడలి సమీపంలోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ లో ?: నాసిర్ బెస్ట్ (21) అనే సాయుధ యువకుడు బ్యాగ్ నుండి తుపాకీ తీసి అక్కడి అధికారులపై కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ బలగాలు వెంటనే ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు ఆసుపత్రిలో మరణించాడు. ఘటన జరిగిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

కాల్పుల అనంతరం కొంతసేపు వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి అప్రమత్త పరిస్థితులు అమలు చేసినట్లు సమాచారం. పాత్రికేయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది.
1 Dead Trump Safe : భద్రతా లోపాలపై మళ్లీ చర్చ

ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ భద్రతా అంశాలు వరుసగా వార్తల్లో నిలుస్తుండటంతో అమెరికాలో మరోసారి భద్రతా వ్యవస్థలపై చర్చ మొదలైంది.

గతంలో కూడా వైట్ హౌస్ సమీపంలో భద్రతా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ఘటనపై దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ చేపట్టాయి. అయితే ఈ ఘటనకు విదేశీ కుట్రలు లేదా ఇతర దేశాలతో సంబంధం ఉందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు.
1 Dead Trump Safe : అతడు వయోలెంట్

కాల్పులు జరిపిన దుండగుడు నసీర్ బెస్ట్‌కు హింసాత్మక చరిత్ర ఉందని, అమెరికా అత్యంత ప్రతిష్టాత్మక కట్టడం వైట్ హౌస్‌పై అతనికి వ్యామోహం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
“వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కాల్పుల ఘటన జరిగిన ఒక నెల తర్వాత ఈ ఘటన జరిగింది. వాషింగ్టన్, డి.సి.లో ఇప్పటివరకు నిర్మించిన వాటిలోకెల్లా అత్యంత సురక్షిత , భద్రత కలిగిన ప్రదేశాన్ని పొందడం భవిష్యత్ అధ్యక్షులందరికీ ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. మన దేశ జాతీయ భద్రతకు ఇది అవసరం,” అని ఆయన అన్నారు.
ALSO READ : Trump Facing Pressure : యుద్ధంపై సందిగ్ధం Andhra Prabha Top Story
