1 day schools | అప్పటి నుంచే ఒంటిపూట బడులు

1 day schools | అప్పటి నుంచే ఒంటిపూట బడులు
1 day schools | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ఒంటిపూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు, పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని ఉత్తర్వులో పేర్కొంది.
