దారి ఆక్రమణ.. బీడు భూములుగా మారిన పొలాలు

దారి ఆక్రమణ.. బీడు భూములుగా మారిన పొలాలు
పట్టించుకోని సంబంధిత అధికారులు
తొర్రూరు,ఆంధ్రప్రభ: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ శివారులో కొత్తగూడెం సమీపంలోని ఎస్సారెస్పీ డిబిఎం 57 కెనాల్ కాల్వ కు ఇరువైపుల దారి ఏర్పాటు చేస్తే జనాలు దారిని కొంతమంది ఆక్రమించుకున్నారు. కానీ ప్రస్తుతం ఒకే వైపున మాత్రమే దారి ఉండగా, మరో వైపు ఉన్న దారిని కొంత మంది రైతులు ఆక్రమించుకొని పంటలు సాగు తీసుకొని ఆ దారిలోనే బోర్ వేసి అటు వైపు వెళ్లేందుకు దారి లేకుండా చేశారని బాధిత రైతులు ఆరోపించారు. అనేకసార్లు సంబంధిత ఎస్సారెస్పీ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ పనులను చేసేందుకు వీలు లేక తమ భూముల్లో పంటల సాగు చేయకుండానే దిక్కులేని స్థితిలో బీడు భూములుగా వదిలేశామని బాధిత రైతులు వెంకట్ రెడ్డి తో పాటు మరి కొంతమంది రైతులు పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ,ఎస్ఆర్ఎస్ పి అధికారులు వెంటనే స్పందించి కెనాల్ దారిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని కెనాల్ దారిని పునరద్దరించాలని రైతులు కోరారు.లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
