భార్య‌ను చంపిన భర్త

భార్య‌ను చంపిన భర్త

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్ర‌ప్ర‌భ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని విట్టల్ వాడి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిన్న‌ రాత్రి పవర్ కిషన్ తన భార్య పవర్ సేవ్ బాయి(40)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పవర్ కిషన్ హైదరాబాద్ లో ఉంటూ కొన్ని రోజుల క్రితం తండాలోని త‌న‌ ఇంటికి ఓ ముఖ్యమైన పని విషయంలో వ‌చ్చాడు. మానసిక పరిస్థితి బాగాలేని పవర్ కిషన్ చిన్న విషయానికే భార్యను హత్య చేసిన‌ట్లు గ్రామ‌స్తులు తెలిపారు. మృతి చెందిన ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు.


కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ రోజు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి మృత‌దేహాన్ని తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్ సైతం మృతుదేహాన్ని పరిశీలించారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply